రైతుల ఖాతాల్లో జమకాని రైతుభరోసా నిధులు- నగదు కోసం ఆర్బీకేలు, బ్యాంకుల చుట్టూ అన్నదాతలు - ఏపీ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2023, 10:18 AM IST
Farmers Fire on CM Jagan Raitu Bharosa Issue: 'వైఎస్సార్ రైతు భరోసా' పేరుతో రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ సీఎం జగన్ బటన్ నొక్కి రోజులు గడుస్తున్నా.. తమ ఖాతాల్లో నగదు జమ కాలేదని కృష్ణాజిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం(YSR Rythu Bharosa Kendram) సిబ్బందిని వివరణ కోరితే వారు స్పందించడం లేదని వాపోతున్నారు. సాగు కోసం ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేశామని.. రైతు భరోసా నిధులు రాకపోవడంతో ఏం చేయాలో అర్థంకావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
"'వైఎస్సార్ రైతు భరోసా' పేరుతో రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామంటూ సీఎం జగన్ బటన్ నొక్కి రోజులు గడుస్తున్నా.. మా ఖాతాల్లో నగదు జమ కాలేదు. రైతు భరోసా కేంద్రం సిబ్బందిని వివరణ కోరితే వారు స్పందించడం లేదు. ఇప్పటికే సాగు కోసం వేల రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు రైతు భరోసా నిధులు రాకపోవటంతో ఏం చేయాలో మాకు పాలుపోవటంలేదు." - రైతన్నల ఆవేదన