ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers_Blocked_National_Highway_Works_in_Vijayawada

ETV Bharat / videos

Farmers Blocked National Highway Works in vijayawada : జాతీయ రహదారి పనులను అడ్డుకున్న రైతులు.. పరిహారం చెల్లించాలని డిమాండ్​ - ఏపీ జాతీయ రహదారి వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 5:41 PM IST

Updated : Sep 2, 2023, 10:42 PM IST

Farmers Blocked National Highway Works in Vijayawada : ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలో పంట పొలాల సమీపంలో ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి (National highway) వెంబడి కరెంట్ లైన్ల నిర్మాణాన్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. జాతీయ రహదారి పనులో భాగంగా నేషన్ పవర్ థర్మల్ కార్పోరేషన్(ఎన్​టీపీసీ) వాళ్లు జాతీయ రహదారి వెంబడి కరెంటు లైన్లను నిర్మిస్తున్నారు. పరిహారం చెల్లించకుండానే అధికారులు కరెంటు లైన్ల పనులు మొదలు పెట్టటం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జిల్లాలోని నున్నలో ఇటీవల నిర్మించిన ఆరు లైన్ల జాతీయ రహదారి వెంబడి కరెంటు లైన్​ పనులు ఎన్​టీపీసీ అధికారులు మొదలు పెట్టారు. ఈ కరెంటు లైన్ల నిర్మాణాన్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. తమకు పరిహారం చెల్లించకుండా పనులు మొదలు పెట్టటం ఏంటి అని ప్రశ్నించారు. రైతులకు రావాల్సిన పరిహారం చెల్లించకుండా, తమ భూములు కరెంటు స్తంభాల ఏర్పాటుకు ఎంతపోతుందో చెప్పకండానే పనులు చేపట్టంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పొలాల్లో పనులు చేసుకోకుండా రాళ్లు అడ్డం పెట్టి రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. ఈ వివాదంపై కేసు ఇంకా కోర్టులో ఉన్నా.. ఎన్​టీపీసీ అధికారులు పనులు ప్రారంభించటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు పరిహారం అందించి పనులు చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. 

Last Updated : Sep 2, 2023, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details