ఆంధ్రప్రదేశ్

andhra pradesh

farmers_struggle_crop_pest

ETV Bharat / videos

వర్షాభావం, తెగుళ్లతో మిర్చి రైతుల ఇక్కట్లు - లక్షల్లో నష్టం జరిగినా స్పందించని ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 12:07 PM IST

Farmers are Struggling with Crop Pests : రాష్ట్రంలో ఒకవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు పంట తెగుళ్లతో రైతులు అల్లాడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఉరవకొండ నియోజకవర్గంలో.. సుమారు 60 వేల ఎకరాలలో మిరప పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఒక్కో ఎకరాకు 1.5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. హెచ్​ఎల్​సీ, జీబీసీ తో పాటు హంద్రీనివా ప్రధాన కాలువ కింద పంటలను సాగుచేస్తున్నారు. ఈ సారి పంటలకు విల్ట్​తో పాటు.. ఎర్ర, నల్ల, తెల్ల నల్లుల తాకిడి అధికంగా ఉంది. దీంతో చాలా చోట్ల పంటలు దెబ్బతింటున్నాయి. 

తెగుళ్లను నియంత్రించేందుకు రైతులు.. వారానికి మూడుసార్లు మందులను పిచికారీ చేసిన ఎలాంటి ఫలితం దక్కలేదు. దీని వల్ల రైతులపై అధిక భారం పడుతోంది. అదే విధంగా ఆకు ముడత, బూడిద తెగుళ్లు కారణంగా.. పంట పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతున్నదని రైతులు వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కష్టాల కొలిమిలో ఉన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details