Jagan photo on Passbook: నా పాస్ బుక్‌పై జగన్ ఫొటో ఎందుకు..? అధికారులను నిలదీసిన రైతు - Farmer Peer saheb
Farmer question why Jagan photo on Passbook: తన పాస్ బుక్‌పై జగన్ ఫొటో ఎందుకు ముద్రించారని ఓ రైతు అధికారులను నిలదీశారు. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరగగా.. పీరా సాహెబ్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో తన పాస్ బుక్‌పై జగన్ ఫొటో ఎందుకు ముద్రించారని ఓ రైతు అధికారులను నిలదీశారు. చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన పీరా సాహెబ్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందని సబ్తహసీల్దార్ రమణబాబు ముందు గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామంలో 122వ సర్వే నంబర్‌లో రైతు తనకు 6 ఎకరాల 62 సెంట్లు ఉందని, తన వద్దఉన్న పాత పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయని అన్నారు. కొత్త పాస్ పుస్తకంలో మాత్రం 6 ఎకరాల 61 సెంట్లు ఉన్నట్లు నమోదు చేసి ఇవ్వడం ఏంటని అధికారిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తహసీల్దారును అడుగుదామంటే ఆయన గదిలోకి అనుమతించడం లేదన్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చానని సబ్తహసీల్దార్ వద్దకు వెళ్లి పుస్తకాన్ని టేబుల్‌పై విసిరేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.