ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers_Anger_Over_Construction_of_Towers_in_Kurnool_District

ETV Bharat / videos

కోత దశలో పంటను ధ్వంసం చేసి విద్యుత్ టవర్ల నిర్మాణం - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 4:41 PM IST

Farmers Anger Over Construction of Towers in Kurnool District :నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఉన్న గ్రామాల్లో పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టవర్లపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కోత దశలో ఉన్న పంటను ధ్వంసంచేసి టవర్ల నిర్మాణం చేయటం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంట పూర్తయ్యేవరకు రెండు నెలలు ఆపాలంటూ రైతులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి పరిహారం ఇవ్వకుండా కోత దశలో ఉన్న పంటలను ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేపట్టడంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్తు పనులు పచ్చటి పంట పొలాలను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.

దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోయారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు వద్ద ఉన్న పవర్ గ్రిడ్ ట్రాన్స్​మిషన్ సబ్ స్టేషన్ వరకు టవర్ల ఏర్పాటు చేయాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీనికోసం 30 గ్రామాల మీదుగా 112 కిలోమీటర్ల మేర టవర్లను నిర్మాణం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details