ఆంధ్రప్రదేశ్

andhra pradesh

farmers_and_women_candlelight_rally_in_amaravati_continue_to_capital

ETV Bharat / videos

'మూడు రాజధానుల నిర్ణయం మూర్ఖత్వమే' - అమరావతినే కొనసాగించాలని కొవ్వొత్తుల ర్యాలీ - మూడు రాజధానుల నిర్ణయం మూర్ఖత్వమే అంటున్న రైతులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 12:23 PM IST

Farmers And Women CandleLight Rally In Amaravati Continue to Capital: ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న ఈ ఉద్యమం ప్రారంభించి 4 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పగలంతా దీక్షా శిబిరాలలో ఆందోళన చేసిన రైతులు రాత్రి వేళల్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. పగలంతా దీక్షా శిబిరాలలో వివిధ నిరసన కార్యక్రమాలు రైతులు నిర్వహించేవారు. కొవ్వొత్తులతో కాగడాల ప్రదర్శన చేపట్టేవారు. తుళ్లూరు మండలం మందడం, వెంకటపాలెంలో రైతులు, మహిళలు మానవహారాలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఇన్నాళ్లు ఎదురు చూసిన సమయం మరో మూడు నెలల్లో ఎన్నికల రూపంలో రాబోతుందని రైతులు అన్నారు. ప్రగతి నిరోధక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. సంపద సృష్టించే అమరావతిని నిర్వీర్యం చేసే మూడు రాజధానుల నిర్ణయం మూర్ఖత్వమే అని రైతులు అంటున్నారు. ఆదివారం రాత్రి రాజధాని గ్రామాల్లో కొవ్వొత్తులతో అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్​కు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details