Stormy Winds: ఈదురుగాలులతో రాలిన మామిడి పండ్లు.. తీవ్రంగా నష్టపోయిన రైతులు - Stormy winds in the Brahmasamudra zone
ఆరుగాలం కష్టపడి పడించిన పంట కళ్ల ముందు చేతికందకుండా పోతుంటే రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో వీచిన ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరమసముద్రం మండల పరిధిలోని సూగేపల్లి ఎస్ కోనాపురం ప్రాంతాల్లో గాలుల తీవ్రతకు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్లపైన వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న చెట్లపై పెద్ద పెద్ద వృక్షాలు పడిపోవడంతో అవి దెబ్బతిన్నాయి. మొక్కజొన్న, మామిడి, కాకర పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతకొచ్చిన మొక్కజొన్న, మామిడి పంట పూర్తిగా నేలకొరగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురగాలులకు మామిడి కాయలు రాలి పడ్డాయి. ఎక్కడికి అక్కడ ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో ఎప్పుడు మరమ్మతులు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయాలా అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. రెండు ఎకరాల తన కాకర పందిర ఈదురుగాలలకు దెబ్బతినడంతో మహిళ రైతు సిద్దేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.