ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmer_Plowed_Groundnut_Crop

ETV Bharat / videos

చెమటోడ్చినా దక్కని ఫలితం - కళ్లెదుటే ఎండిపోతున్న వేరుశనగ పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు - Farmers problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 12:14 PM IST

Farmer Plowed Groundnut Crop with Tractor in Chinthakommadinne :వేరుశనగ రైతు పంటను ట్రాక్టర్‌తో దున్నివేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలంలోని గొర్లపల్లె గ్రామానికి చెందిన రైతు గుర్రంపాటి బాలిరెడ్డి ఎకరాలో వేరుసెనగ పంట (Groundnut Crop) సాగు చేశారు. ఎకరాకు 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 100 రోజులకు పంట దిగుబడి రావాల్సి ఉండగా.. 105 రోజులు దాటినా పిందెలు తప్ప కాయలు రాలేదు. సకాలంలో వర్షాలు (No Rains) లేక వేరుశనగ కాయలు ఊరలేదు.  

Groundnut Farmer Problems in YSR District :అదే సమయంలో పంట ఎండిపోవడం గమనించిన రైతు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో రైతు గుర్రంపాటి బాలిరెడ్డి చేసేది ఏమీ లేక గురువారం సాగులో ఉన్న పంటను ట్రాక్టరుతో దున్నేశాడు. వర్షాలు లేక తీవ్రంగా నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో రెండు ఎకరాల చామంతి పూలు వేశాడని, పూలు బాగా పండినప్పటికీ కనీస మద్దతు ధర లేకపోవడంతో దున్నివేశాడని తెలిపాడు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించాలని రైతు కోరుతున్నాడు.

Groundnut Farmers Removing Crop :చింతకొమ్మదిన్నె మండలమే కాకుండా నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోని రైతులు రేగడి పొలంలో ఎండిపోతున్న మినుము పంటను కూడా దున్నేసే పరిస్థితిలో ఉన్నారని రైతులు అంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details