Farmer Complant On Volunteer వాలంటీర్ నిర్వాకం.. ఈ క్రాపు కోసమంటూ సంతకం తీసుకుని.. పొలం రాయించుకుంది - తెలుగు ప్రధాన వార్తలు
Farmer Esobu Complant On Grama Volunteer In Lakshmakkapalli : ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లిలో ఓ మహిళా వాలంటీర్ నిర్వాకం బయటపడింది. ఇండ్ల యోసోబు అనే వృద్దుడితో దొంగ సంతకాలు తీసుకొని వాలంటీర్ పొలాన్ని కాజేసిందని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశాడు. గత ఏడాది పంట పొలం ఈ క్రాప్ చేయాలని సంతకాలు తీసుకున్నారని యోసొబు ఆరోపించాడు. తనకు ఉన్న మూడు ఎకరాల అసైన్ మెంట్ భూమిని ఆ సంతకాలతో తన పేరుపై ఉన్న భూమిని వాలంటీర్ తండ్రి బాలయ్య పేరుపై ఎక్కించుకున్నారని ఆయన ఆరోపించాడు. పలు మార్లు అధికారులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయిందని బాధితుడు వాపోయాడు. తనను మోసం చేసిన వాలంటీర్‌పై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు ఇండ్ల యోసోబు వేడుకుంటున్నాడు.
స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఆర్జి ఇచ్చి ఫిర్యాదు చేశామని దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు నాగయ్య తెలిపాడు. 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్న ఎమ్మార్వో, రాజకీయ నాయకుల ఒత్తిడితో సమస్యను పట్టించుకోవడం లేదని, తిరిగి ఇండ్ల యోసోబుపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆయన ఆరోపించాడు.