తండ్రిని కాపాడేందుకు కుమారుడి యత్నం, విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - anantapur farmer die
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2024, 4:12 PM IST
Farmer Dies Due to Electric Shock : విద్యుత్ ఘాతంతో తండ్రీ, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చోసుకుంది. నార్పల మండలం జంగం రెడ్డిపల్లికి చెందిన భయపరెడ్డి, ఆయన కుమారుడు రాజారెడ్డి విద్యుత్ ఘాతంతో మృతి చెందారు. నరసాపురం గ్రామ సమీపంలో తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టడానికి తండ్రి, కుమారుడు పొలం దగ్గరకు వెళ్లారు. పంటకు నీరు పెట్టే సమయంలో భయపరెడ్డి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. అతనిని కాపాడేందుకు కుమారుడు రాజారెడ్డి ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
Police Have Registered Case And Investigating :తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. తండ్రి, కొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి, కుమారుడి మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలో మునిగి పోయారు. వారిని చూసి స్థానికుల మనసు కలచి వేసింది.