Farmer Burnt Banana Crop: పది నెలలు గడిచినా రాని అరటి గెలలు.. మనస్థాపంతో చెట్లకు నిప్పు - AP Latest News
Farmer Burnt Banana Crop in Kadapa District :వర్షాభావంతో పది నెలలు గడిచినా అరటిపంట గెలలు రాకపోవడంతో.. తన పంటను తానే బూడిద చేసుకున్నాడో రైతు. కడప జిల్లా లింగాల మండలం లోపటనూతల గ్రామనికి చెందిన ఏలూరు మహేశ్వర్ రెడ్డి అనే రైతు.. తన మూడు ఎకరాల అరటి పంటను అగ్నికి ఆహుతి చేశాడు. బిందు సేద్యం ద్వారా ఎరువులు, మందులు వాడినా.. లాభం లేకుండా పోయిందని రైతు వాపోయాడు. పది నెలలకు దిగుబడి రావాల్సి ఉండగా.. ఇప్పటికి చాలా చెట్లకు గెలలు కూడా రాలేదని తెలిపాడు. ఇప్పటికే పెట్టుబడి రూపంలో రూ. లక్షన్నర, దిగుబడుల రూపంలో మరో రూ.5 లక్షలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు తనకున్న 16 ఎకరాల్లో 6 ఎకరాల్లో రెండు చోట్ల అరటి పంటను సాగు చేశాడు.. రెండు చోట్ల ఇదే పరిస్థితి ఉందని వాపోయాడు. వేడిగాలుల తీవ్రత పెరగడం, జనవరి నుంచి వర్షం సరిగా లేకపోవడంతో 25 కిలోలు రావాల్సిన అరటి గెల.. 18 కిలోలకే పరిమితమైందని.. ఇలానే కొనసాగితే లాభం లేదని.. అరటిపంటను బూడిద చేసినట్లు తెలిపాడు.
TAGGED:
farmer burnt his banana crop