ఆంధ్రప్రదేశ్

andhra pradesh

fapto_agitation_on_show_cause_notices_to_teachers

ETV Bharat / videos

ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులపై ఆందోళన - డీఈవో కార్యాలయం ముట్టడించిన ఫ్యాప్టో - Show Cause Notices to Teachers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2023, 2:22 PM IST

FAPTO Agitation on Show Cause Notices to Teachers : నెల్లూరు జిల్లాలో 54 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో ఆందోళన చేపట్టింది. అధికారుల తీరును నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయుల పనితీరులో లోపాలు ఉంటే సరిచూసుకోవాలని సూచనలు, హెచ్చరికలు చేయాలి తప్ప.. షోకాజ్ నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు. తక్షణం నోటీసులను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. పాఠశాలల పర్యవేక్షణ పేరుతో చిన్న చిన్న కారణాలతోనే.. నోటీసులు ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందజేయకుండా ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతో సిలబస్ పూర్తికాలేదంటూ.. విద్యార్థులు నోట్స్ రాయలేదన్న కారణాలతో నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు సైతం నోటీసులు అందించారని అన్నారు. విద్యాశాఖ అధికారులు నోటీసులను వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.  

"పాఠశాల పర్యవేక్షణ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు చేసే విధంగా ఉండాలి. సూచనలు, సలహాలతో పోయేదాన్ని.. ఈరోజు షోకాజు నోటీసులు ఇవ్వడాన్ని ఫ్యాప్టో ఖండిస్తోంది. సెప్టెంబర్​ నెల వచ్చినా ఇప్పటికి పాఠశాలలకు పుస్తకాలు, వర్క్​బుక్​లు అందించలేదు. అటువంటి ప్రభుత్వం.. అధికారులు వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉపాధ్యాయులకు నోటీసులు అందించడం సిగ్గుమాలిన చర్య." -సురేందర్​ రెడ్డి,  ఫ్యాప్టో నేత 

ABOUT THE AUTHOR

...view details