విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి - ప్రముఖ విద్యావేత్త సత్యవాణి - Famous Educationist Satyavani in vijayawada
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 2:39 PM IST
Famous Educationist Satyavani as Chief Guest in Ambitus School Anniversary: భవిష్యత్ తరాలకు అవసరమైన ఆత్మస్థైర్యం పెంపొందించడానికే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రయత్నిస్తారు అదే మన భారతదేశ విద్యావిధానం అని ప్రముఖ విద్యావేత్త(Educationist) సత్యవాణి తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో సమాజం మీద ఆధారపడకుండా సమాజానికి ఆధారమయ్యే వ్యక్తులను తయారుచేసేదే పాఠశాల అని చెప్పారు. విజయవాడలోని ఆంబిటస్ ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం(Ambitus school Anniversary) సందర్భంగా ఆదివారం ఆమె ముఖ్యఅతిథి(chief guest)గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర తదితర అంశాలను చిన్నతనంలోనే పిల్లలు అధ్యయనం చేయాలని తెలిపారు.
Satyavani Addressed Parents and Students about Society : విద్యార్థి దశలో పిల్లలు చదువుతో పాటు వారికి ఇష్టమైన రంగాలలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రముఖ విద్యావేత్త సత్యవాణి సూచించారు. ప్రపంచ దేశాలు మొత్తం ఇప్పుడు భారతీయ సంస్కృతిని ఆచరిస్తున్నాయని గుర్తు చేశారు. గొప్పగొప్ప వ్యక్తుల నిర్మాణం పార్లమెంటులో జరగదని కేవలం పాఠశాలలోనే రూపుదిద్దుకుంటుందని ఆమె పేర్కొన్నారు. వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడే జాతి నిర్మాణం జరుగుతుందని కాబట్టి విద్యార్థులను డాలర్ కోసం వెంటపడే వారిగా కాకుండా దేశ నిర్మాణంలో పాలుపంచుకునే వారిగా తయారుచేయాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నారు.