ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Famous Doctors Condem Chandrababu Arrest చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ వైద్యుల ఆందోళ

ETV Bharat / videos

Famous Doctors Condem Chandrababu Arrest చంద్రబాబు అరెస్టుపై ప్రముఖ వైద్యుల ఆందోళ.. బాబు సేవలు దేశానికి అవసరమన్న నిపుణులు - i am with cbn

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 4:03 PM IST

Condemnation of Chandrababu arrest : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై దేశ, విదేశాల్లోనూ నిరసన కొనసాగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో స్థిర పడిన తెలుగు ప్రజలంతా చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఎందరో నాయకులు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు (Engineering Students), ఐటీ నిపుణులు, ఐటీ ఉద్యోగులు, ఎన్​ఆర్​ఐలు ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు పూర్తిగా రాజకీయకక్షగా అభివర్ణిస్తున్నారు. స్కిల్ డెవలప్​మెంట్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ తీసుకున్న ఎంతో మంది యువత.. చంద్రబాబు అరెస్టుపై మండిపడుతోంది. 

అరెస్టును ఖండించిన వైద్య నిపుణులు... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ప్రముఖ వైద్యనిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి, దేశానికి చంద్రబాబు లాంటి సమర్థ నాయకుడి అవసరం చాలా ఉందన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి రాజమహేంద్రవరం వెళ్లిన డాక్టర్ సోమరాజు, డాక్టర్ బీ.ఎన్.ప్రసాద్... చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్కిల్ డెవలప్​మెంట్ (Skill Development Corporation) కార్పొరేషన్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగలేదని... గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details