దొంగ నోట్లు సరఫరా చేసే ముఠా అరెస్ట్- ₹.14 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం - fake currency gang arrest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 11:59 AM IST
Fake Currency Supplied Gang Arrested in West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ కరెన్సీ నోట్లు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అసలు నోట్లకు బదులు నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని నోట్ల మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి దొంగ నోట్లు సరఫరా చేసే ముఠా ₹.3 లక్షలు అసలు నోట్లు తీసుకొన్నారు. అనంతరం 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
దీంతో పథకం ప్రకారం గురువారం పరింపూడి గ్రామ సమీపంలో నోట్ల మార్పడి కోసం వేచి ఉన్న నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 లక్షల 96 వేల రూపాయల టాయ్ కరెన్సీ, 4 వేల రూపాయల అసలు నోట్లు, కారును స్వాధీనం చేసుకున్నామని ఎసై తెలిపారు.