FAFTO leaders Angry: విద్యాశాఖ అధికారుల తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు: ఫ్యాఫ్టో నేతలు - FAFTO leaders Fires on CM
FAFTO Meeting in Srikakulam: వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి.. ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్(ఫ్యాఫ్టో-FAFTO) నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో... ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఫ్యాప్టో సమావేశం నిర్వహించారు. CPS రద్దు చేస్తామన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడేమో GPS విధానాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తీరు మార్చుకోవాలన్నారు. విద్యారంగం, ఉపాధ్యాయుల పట్ల అధికారుల తీరు మారాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. రాష్ట్ర విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెలవురోజుల్లో అర్ధరాత్రి వేళ విద్యార్థుల ఇళ్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్లి ఉపాధ్యాయుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. ఉపాధ్యాయుల కామన్ సీనియారిటీ సమస్య పరిష్కరించకుండా గందరగోళ పరిచేలా ఉద్యోగన్నతులు కల్పిస్తున్నారని విమర్శించారు. పాఠశాల విద్యలో ప్రభుత్వాలు సిలబస్‌ను వారికి ఇష్టం వచ్చినట్లు మార్చడం సరికాదన్నారు.