Vishakapatnam Railway authorities alert ఒడిశా రైళ్ల ప్రమాదంతో అప్రమత్తమైన విశాఖ అధికారులు.. - odisha train tragedy updates
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది గాయపడగా.. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బోగీల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్ ముమ్మరంగా గాలిస్తోంది. అటు భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 1200 మంది సిబ్బంది ఈ సహాయకచర్యల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అత్యవసర విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం.. హైల్పలైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. హావ్‌డా వెళ్లే రైళ్లన్నింటిని దారి మళ్లించి పంపిస్తున్నట్లు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటివరకు హావ్‌డా నుంచి ఒక్క రైలు కూడా రాలేదని చెబుతున్నారు. ప్రమాద ఘటన అనంతరం.. విశాఖపట్నం రైల్వే అధికారులు తీసుకున్న చర్యలపై.. మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.