అల్లుడికి తొలిసారి నిమ్మకూరు వాసుల ఆతిథ్యం.. ఘనంగా ఏర్పాట్లు - ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు
NTR FAMILY MEMBERS INTERVIEW : బావగారు బాగున్నారా అంటూ అల్లుడికి కొత్త తరహా ఆతిథ్యం ఇస్తామంటున్నారు కృష్ణా జిల్లా నిమ్మకూరు వాసులు. ఇంటి అల్లుడై నాలుగు దశాబ్దాలు దాటినా తమ పుట్టింటి ఆతిథ్యం తీసుకునే అవకాశం ఇప్పటివరకు రానందున.. రాకరాక వచ్చిన అవకాశాన్ని వదులుకోమంటున్నారు. ఎవరా అల్లుడు ఏంటా ఆతిధ్యం అనుకుంటున్నారా ?.. ఆ అల్లుడు ఎవరో కాదు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయనకు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఇంతవరకు బస చేసే అవకాశం, సందర్భం రాలేదు.
ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బుధవారం రాత్రి నిమ్మకూరులోనే బస చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ వారసులు పెద్ద ఎత్తున నిమ్మకూరు చేరుకున్నారు. అంతేకాకుండా బందరు పర్యటనకు వెళుతున్న చంద్రబాబుకు చినఓగిరాల వద్ద ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ ఆశయాలను భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరి పైన ఉందంటున్నఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ , సుహాసినిలతో మా ప్రతినిథి ముఖాముఖి..