GV RAO INTERVIEW: 'అప్పుల ఊబిలో ఏపీ.. మేల్కోకపోతే పెను ఉపద్రవం తప్పదు' - ఏపీలో రూ 10 లక్షల కోట్లకు చేరిన రుణభారం న్యూస్
Interview With GV RAO: ఆంధ్రప్రదేశ్ అప్పు మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలు దాటిందని.. ప్రముఖ ఆర్థిక నిపుణుడు జీవీ రావు అన్నారు. ఈ అప్పులకు వడ్డీ చెల్లించాలంటే మరోచోట రుణాలు తీసుకుని రావాల్సిన పరిస్థతి ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని మించిపోయిందని ఆయన అన్నారు. పక్క రాష్ట్రల ప్రభుత్వాలు మూలధన వ్యయాలపై ఖర్చు పెట్టి.. కొత్త పరిశ్రమలు తీసుకుని వచ్చేందుకు రుణాలు తీసుకువస్తుంటే.. ఏపీలో మాత్రం రోజువారీ ఖర్చుల కోసం అప్పులను తీసుకొస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పరిస్థితి ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ కంటే ఘోరంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత సంస్థలు హెచ్చరిస్తున్నా వాటి సూచనలను ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆయన మండిపడ్డారు. అదే సమయంలో ఉచితాల ముసుగులో ఏపీలో భారీ అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. తక్షణమే మేల్కోకపోతే పెను ఉపద్రవం తప్పదని జీవీ రావు హెచ్చరించారు.