Chandramouli Story: విధిరాతను జయించి.. మొక్కవోని ధైర్యంతో గెలుపొందిన అనకాపల్లి యువకుడు
Face to Face with Anakapalli Young Man: అనుకోని ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయినా.. మొక్కవోని ధైర్యమే ఆ యువకుడి ఆయుధమైంది. ఇక్కడే ఆగిపోవాలా అనే ఆలోచన నుంచి కష్టపడేతత్వం పెరిగింది. ఫలితంగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌లో సీటు దక్కింది. విధి చిన్నచూపు చూసిన ఈ యువకుడు కష్టపడి ఐఐఎంలో సీటు సాధించాడు. అయితే అక్కడికి వెళ్లేందుకు వ్యక్తిగత, ఆర్థిక కష్టాలు సవాళ్లు విసురుతున్నాయి. జీవితాన్ని ఎదురీదుతున్న తనకు ఈ కష్టాలు కొత్తేమీ కాదంటున్నాడు. శరీరం సరిగా ఉండి కాస్త కష్టం వస్తేనే కుంగిపోయే వారికి అతను స్ఫూర్తిగా నిలుస్తున్నాడు అనకాపల్లి జిల్లా పెద్దబొడేపల్లికి చెందిన ద్వారపురెడ్డి చంద్రమౌళి. మరి, విధి చిన్నచూపు చూసినా కుంగిపోకుండా పయనిస్తున్న తనకు ప్రభుత్వం సహాయం చేయాలంటున్నాడు. మరి తను కాళ్లు, చేతులు ఎలా కోల్పోయాడు. అయినా ఎలా తిరిగి విజయాన్ని అందుకున్నాడు. అతను ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి..? వాటి పరిష్కారం కోసం తాను ఏ విధంగా ముందుకువెళుతున్నాడో అతని మాటల్లోనే తెలుసుకుందాం..