ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Eye Infection Cases: రాష్ట్రంలో విజృంభిస్తోన్న 'కళ్లకలక'.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్!

By

Published : Aug 1, 2023, 1:51 PM IST

కళ్లకలకల వ్యాధి

Eye Infection Cases Increasing in AP: రాష్ట్ర వ్యాప్తంగా కళ్లకలకలు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు కంటి ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. ఇటీవల వరుసగా వర్షాలు పడటంతో వైరస్ విజృంభిస్తోందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఎడినో వైరస్ కారణంగా కళ్లు ఎరుపెక్కి, దురదలు వస్తాయని.. ప్రస్తుతం వస్తున్న కేసుల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు తెలిపారు. కళ్లు ఎరుపెక్కటం, దురదలు, కంటిలో మంట ఏర్పడటం, కళ్లు ఎరుపు రంగులోకి మారటం ఈ వ్యాధి లక్షణాలని తెలిపారు. ఈ లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి త్వరగా సోకుతుందని.. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. బాధితులు వినియోగించిన టవళ్లు, దుప్పట్లు, చేతి రుమాల్లు, దుస్తులు, వస్తువులను.. ఇంట్లో మిగిలిన వాళ్లు ముట్టుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వినియోగిస్తే వెంటనే వైరస్ సోకే ప్రమాదముంటుందని చెబుతున్నారు. కంటిచుక్కల మందు వినియోగిస్తే ఉపశమనం లభిస్తోందని, రోజుకు 6సార్లు దీన్ని వేసుకుంటే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కేసుల నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details