బార్ల లీజులను వేలం వేసేందుకు అబ్కారీశాఖ నోటిఫికేషన్ జారీ - Liquor Store News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 10:19 PM IST
Excise Department Issued Notification on Bar Lease Auction:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ల లీజులను వేలం వేసేందుకు అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు లైసెన్సులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. 2బి బార్ లైసెన్సులను ఇ-ఆక్షన్ ద్వారా వేలం వేయనున్నట్లు అబ్కారీ శాఖ కమీషనర్ వివేక్ తెలిపారు.
Excise Commissioner Vivek Yadav on Bars Auction: ''బార్ల లీజులను వేలం వేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదలైంది. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 ఆగస్టు 31వ తేదీ వరకు లైసెన్సులు కూడా జారీ చేశాం. 2బి బార్ లైసెన్సులను ఇ-ఆక్షన్ ద్వారా వేలం వేయనున్నాం. విదేశీ మద్యం విక్రయాలకు అనుమతిస్తూ, లీజులు ఇవ్వాలని నిర్ణయించాం. 2024 జనవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు గడువు విధించాం. 5వ తేదీన ఇ-ఆక్షన్ బిడ్లను జిల్లాల వారీగా ఖరారు చేస్తాం. ఇందులో పాల్గొనేందుకు నాన్-రీఫండబుల్ ఫీజు చెల్లించాలి. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతానికి 5 లక్షల రూపాయలు, 5 లక్షల జనాభా లోపు వారికి 7 లక్షల 5 వేల రూపాయలు, అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రాంతానికి 10 లక్షల రూపాయల ధరవాత్తు చెల్లించాలి.'' అని అబ్కారీశాఖ కమిషనర్ వివేక్ యాదవ్ వెల్లడించారు.