ఆంధ్రప్రదేశ్

andhra pradesh

EX_MP_GV_Harsha_kumar_Comments

ETV Bharat / videos

జగన్‌ను గద్దె దింపేందుకు దళితులు సిద్ధం - షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దు : హర్షకుమార్‌ - ys jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 4:54 PM IST

EX MP GV Harsha kumar Comments: వైసీపీ ప్రభుత్వంలో దళితులు నిరాదరణకు గురయ్యారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో దళితులపై అనేక దాడులు జరిగాయని ఒక్క కేసులోనూ న్యాయం జరగలేదని చెప్పారు. సాధికార యాత్రల్లో చెప్పేదంతా అంకెల గారడే అని హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం లేదని అన్నారు. ప్రభుత్వంపై దళితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న హర్షకుమార్‌, దళితుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని  విమర్శించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ లేకుండా చేశారని దుయ్యబట్టారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో నేతల భవనాలు ఇంధ్ర భవంతుల్లా ఉండాలి కానీ పేదలకు మాత్రం సెంటు భూమి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. దళితులపై జరిగిన దాడుల్లో ఒక్క కేసులోనూ న్యాయం జరగలేదని మండిపడ్డారు. గద్దెనెక్కించడానికి ఎలా కృషి చేశారో దించేందుకు అలానే కృషి చేస్తామని హర్షకుమార్ విమర్శించారు. 

ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన నిర్వహించునున్నట్లు తెలిపారు. జగన్‌ను గద్దె దింపేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని హర్షకుమార్ వెల్లడించారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details