ఆంధ్రప్రదేశ్

andhra pradesh

EX MLA Jaleel Khan Slams YS Jagan

ETV Bharat / videos

జగన్మోహన్ రెడ్డి అబద్దాలతో మైనార్టీలను మోసం చేస్తున్నారు: జలీల్ ఖాన్ - అబుల్‌ కలాం‌ ఆజాద్ జయంతి వీడియోలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 10:39 PM IST

EX MLA  Jaleel Khan Slams YS Jagan:  జగన్మోహన్ రెడ్డి అబద్దాలతో మైనార్టీలను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు.  చంద్రబాబు అమలు చేసిన పథకాలను తొలగించి మైనార్టీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మౌలానా అబుల్‌ కలాం‌ ఆజాద్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జలీల్ ఖాన్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చేరిగారు. జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం రంజాన్ తోఫా, విదేశీ విద్యకు డబ్బులు నిలిపి వేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు పెరిగి పోయాయని జలీల్ ఖాన్ వాపోయారు. వేదింపుల వల్లే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, అయినా ఒక్కరి పైనా చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి  ముస్లిం లను అన్ని విధాలా దగా చేశారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్  మైనార్టీలపై కపట ప్రేమ చూపుతున్నారనని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే ముస్లిం లకు మేలు జరిగిందని వెల్లడించారు. జగన్ నాటకాలు తెలుసుకున్న ముస్లింలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని  జలీల్ ఖాన్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details