Perni Nani On Pawan: చెప్పులు కాదు.. పార్టీ గుర్తే పోయింది.. పవన్‌కు పేర్ని నాని కౌంటర్ - పేర్ని నాని
Perni Nani Comments On Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అన్నవరం గుడిలో తన రెండు చెప్పులూ పోయాయని.. మూడు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ ఆందోళన చెందుతున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చెప్పులు పోయిన సంగతి మూడు రోజుల తర్వాత గుర్తుకు వచ్చిందా అని.. చెప్పులు పోతే ఎవరో ఒక సినిమా ప్రోడ్యూసర్ కొనిస్తారని అన్నారు. అయితే ఆయన పార్టీ గుర్తు పోయిందని.. దాన్ని వెతుక్కోమని పేర్ని నాని సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో తన చెప్పులు ఎవరో దొంగిలించారని అన్నారు. దానికి పేర్ని నాని కౌంటర్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. తొమ్మిది నెలల క్రితం లింగమనేని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లిన సమయంలో.. తనది ఒక చెప్పు పోయిందని పేర్ని నాని అన్నారు. ఎవర్ని అనుమానిస్తామని ప్రశ్నించారు.