ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ex--minister_kala_vankatravu_comments_on-ycp

ETV Bharat / videos

ఈవీఎం బటన్​ నొక్కి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు : కళా - విజయనగరం తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2023, 3:11 PM IST

EX- Minister Kala Venkatravu Comments on YCP :రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పొలిట్లే బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్​పై విడుదల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, తెలుగు ప్రజలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కేవలం కక్ష సాధింపు తోనే చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేశారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. 

Kala Venkatravu Fires on CM Jagan : చంద్రబాబును నిర్బంధించి 56 రోజులు గడిచినా... సీఐడీ పోలీసులు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని కళా వెంకట్రావు ఆరోపించారు. 77 ఏళ్లలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. యువత ఉద్యోగాలు రావాలన్నా... పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని కళా వెంకట్రావు కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్న భయపడే ప్రసక్తి లేదని ప్రజాప్రక్షాన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details