ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ex_minister_ganta_srinivasa_rao_fires_on_ysrcp

ETV Bharat / videos

జగన్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిగా అమలు చేయలేదు - బహిరంగ చర్చకు సిద్ధం : గంటా - TDP Leaders Comments on YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 6:48 PM IST

Ex Minister Ganta Srinivasa Rao Fires on YSRCP : వైసీపీ ఏ ఒక్క సంక్షేమ పథకమైనా నూటికి నూరు శాతం అమలు చేసిందని నిరూపిస్తే తాము రాజీనామాలకు సిద్ధమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సవాల్​ విసిరారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారని, ఆయన పాలనలో 98 శాతం వరకు విఫలమయ్యారని విమర్శించారు.

ప్రతిపక్ష నేతగా వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ పథకాన్నీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని గంటా ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఎవరైనా సరే, ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్​ విసిరారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని గంటా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details