Avanthi on Pawan Fan పవన్‌ను విమర్శిస్తే ఊరుకోమన్న కార్యకర్త! నన్ను కంట్రోల్ చేయడానికి నీవెవరన్న అవంతి! - Avanthi Srinivas tounge slip
Ex Minister Avanthi Srinivas Comments on Pawan: మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తనను ప్రశ్నించిన వారిపై నోరు పారేసుకోవడం అలవాటుగా మారింది. ప్రతిపక్ష పార్టీలను, అధినేతలను సందర్భం లేకపోయినా.. సందర్భం కల్పించుకుని విమర్శించడం అలవాటుగా మారింది. ఇదేంటని ప్రశ్నిస్తే సహనం కోల్పోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో జగనన్న సురక్ష, నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఊరుకోమని చెప్పడంతో అవంతి అసహనానికి గురయ్యారు. 'ఈ పంచాయతీ ఏమైనా నీ జాగీరా?.. నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాను.. నీవు ఎవడివిరా నన్ను కంట్రోల్ చేయడానికి.. మీరు ఎక్సట్రాలు చేయకండి' అంటూ చిందులేశారు. పవన్ కల్యాణ్ వాలంటీర్లపై సదుద్దేశంగా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అవంతి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దీంతో జనసేన, వైసీపీ మండల నాయకులు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జనసేన నాయకులను చుట్టూ ముట్టడించి మాట్లాడకుండా కట్టడి చేశారు.