ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ex_cs_lv_subrahmanyam_on_political_leaders_taza

ETV Bharat / videos

ప్రజల మధ్యకు రావాలంటే సెక్యూరిటా - ఆ నాయకుడిని ఇంటికి పంపడమే మంచిది: ఎల్వీ సుబ్రహ్మణ్యం - నిమ్మగడ్డ రమేష్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 5:44 PM IST

EX CS LV Subrahmanyam on Political Leaders : ఓ ప్రజాప్రతినిధి ప్రజల మధ్యకు రావాలంటేనే సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి విఘాతమని మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆక్షేపించారు. అలాంటి నాయకుడ్ని ప్రజలు ఇంటికి పంపించడమే మంచిదన్నారు. విశాఖలో సిటిజన్స్‌ ఫర్ డెమొక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏ పార్టీ సభ్యులైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. సదస్సు ఆయన పాల్గొన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ రాష్ట్రంలో ఎంతోమంది ఓట్ల తొలగింపు సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్తగా విడుదలయ్యే జాబితాలో ఓటు లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు.

LV Subrahmanyam Comments on Political leaders : నాయకుల వద్దకు ప్రజలు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు అందరి సూచనలు స్వీకరించాలని, ఒక అంశంపై సలహాలిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఏది మేలు అనేది పరిశీలించి వ్యక్తపరిచేవాళ్లే ప్రజాప్రతినిధులని పేర్కొన్నారు. కలెక్టర్లను, మంత్రులను, శాసనసభ్యులను ప్రజలు కలిసే వాతావరణం ఉండాలని ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ప్రజలే నమ్మని నాయకుడు ఉంటే ఆయనను ఇంటికి పంపడం మంచిదని ఎల్వీ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details