Prathidwani: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ఏం చేసింది? - Today echoes the development of Uttarandhra
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన.. ఆ సందర్భంగా చేసిన కీలక వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతునే ఉంది. అధికార... విపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటలు.. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాల్ని మరోసారి అందరి ముందు చర్చకు పెట్టాయి. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారన్న వివరాలు చెప్పే ధైర్యం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఉందా అని సూటి ప్రశ్నలు సంధిస్తున్నాయి విపక్షాలు. అసలు.. ఉత్తరాంధ్ర ప్రజలేం కోరుకుంటున్నారు? వైకాపా పెద్దలు ఎన్నికలకు ముందు వారికి ఏం హామీలిచ్చారు.. నాలుగేళ్లలో ఆ దిశగా సాధించిన పురోగతి ఎంత? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, వలసల నివారణ సహా.. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఏం చర్యలు చేపట్టారు? ఈ ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాయా? ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైకాపా ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు నిజంగా అక్కడి ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.