PRATIDWANI నిధుల కొరత ఉన్న రాష్ట్రంలో డజన్లకొద్ది సలహాదారులు లక్షల్లో జీతాలు..! - ప్రభుత్వ సలహాదారు
PRATIDWANI ప్రభుత్వానికి ఎందరు సలహాదారులు. సలహాదారులకు భారీ జీతభత్యాల రూపంలో జనంపై పడుతున్న భారం ఎంత. వారిచ్చిన సలహాలెన్ని, అమలు చేసినవెన్నీ.. ఒకవైపు రాష్ట్రంలో రోడ్లు వేయడానికి, కనీసం వాటి మరమ్మతులకు కూడా నిధుల కొరతతో కటకటలాడాల్సి క్లిష్ట పరిస్థితి. బిల్లులు చెల్లించడానికి నిధులు లేమి. అలాంటి చోట సుమారు 50 వరకు సలహాదారులు.. వారికి నెల వారీ లక్షల రూపాయల్లో భారీగా జీతభత్యాలు. ఆ మొత్తం కలిపితే ఏటా కొన్నికోట్ల రూపాయలు. ఇదే విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసినా.. మీకు అధికారుల కొరత ఉందా అని ప్రశ్నించినా.. సలహాదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు వచ్చిందే లేదు. మరి ఈ సలహాల"రావు"లకు అంతెక్కడ. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST