PRATIDWANI కోర్టు ధిక్కరణతో న్యాయస్థానాల మెట్లెక్కుతున్న బాస్లు - అరెస్టుకు వారెంట్
PRATIDWANI చెప్పినా చెవికెక్కించుకోకపోవడం ఆదేశించినా అమలు చేయకపోవడం.. ఆజ్ఞాపించినా బేఖాతర్ చేయడం కోర్టు నిలదీస్తేనో, మందలిస్తేనో.. లేదా అరెస్టుకు వారెంట్ జారీచేస్తేనో, జైలుకు పంపుతామని హెచ్చరిస్తేనో మాత్రమే ఆదేశాలు అమలు చేయడం.. ఉన్నతాధికారులు తరచూ హైకోర్టు మెట్లు ఎక్కడం. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలోని వ్యవహారం. హైకోర్టులో రోజువారీ విచారణకు వస్తున్న కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు కొండలా పెరిగి పోతుండడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. సాధారణంగా ఎప్పుడో ఒకసారి ఇలాంటి కేసులు నమోదవుతుండేవి. ఇటీవల అవి అనూహ్యంగా పెరిగి పోతున్నాయి. అంతేకాదు వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తదితర ఉన్నతాధికారులు ధిక్కరణ ఎదుర్కొంటూ తరచూ బోనెక్కాల్సి వస్తోంది. అసలు ఎందుకీ పరిస్థితి.. దిద్దుబాటు జరగాల్సింది ఎక్కడ. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST