prathidwani: విశాఖ ఉక్కుపై మెుక్కుబడి ప్రయత్నాలేల..! - తెలంగాణ ప్రతిధ్వని
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రగులుతున్న రాష్ట్రంలో అందరి ప్రశ్న.. ఈ విషయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నపాటి చొరవ.., ఎన్నో పోరాటాల ఫలంగా సాధించుకున్న ఉక్కుపరిశ్రమను కాపాడుకోవాలన్న తపన.. ఏపీ సర్కార్‌లో ఏ మేరకు కనిపిస్తోంది? విశాఖఉక్కు ఒక్కటే అని కాదు.. 4ఏళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఇన్నేళ్లలో దఫదఫాలుగా ఎన్నోసార్లు దిల్లీ వెళ్లారు. శాలువాలు కప్పారు. జ్ఞాపికలు, విగ్రహాలు బహూకరించారు. అయితే.... విభజనహామీల నుంచి విశాఖఉక్కు పరిరక్షణ వంటి రాష్ట్రానికి కావాల్సిన అంశాల్లో ఏం సాధించారు? ఇకనైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? రెండేళ్లకు పైగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం ఎన్నోసార్లు దిల్లీ వెళ్లి వచ్చారు? ఐనా కేంద్రం ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఎందుకు ఒప్పించలేక పోయారు? ప్రత్యేకహోదా, పోలవరం, రైల్వే జోన్, విభజన హామీలు... ఇలా ఏది చూసినా నాలుగేళ్లలో ఏం పురోగతి సాధించారంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.