PRATHIDWANI ఎడా పెడా చేస్తున్న అప్పులతో భవిష్యత్‌లో పరిస్థితి ఏంటి - రాష్ట్రం ప్రభుత్వం అప్పుల కోసం అలమటిస్తోంది
PRATHIDWANI రాష్ట్రం ప్రభుత్వం అప్పుల కోసం అలమటిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చేతిలో కనీస నిధులు కూడా లేక అప్పులవేటలో పడింది. ఆదాయం కోసం మద్యం అమ్మకాలను నమ్ముకుంది. ఆర్థికలోటు నుంచి బయట పడేందుకు ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తోంది. చివరకు చెత్తపై కూడా పన్ను వేసి రాబడి పెంచుకునేందుకు పాట్లు పడుతోంది. ఇవి చాలవన్నట్లు అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతోంది. అసలు ఆదాయం పెంచుకోవడంలో ప్రభుత్వం ఎందుకు తడబడుతోంది. ఇప్పటివరకూ చేసిన అప్పులన్నీ వేటి కోసం ఖర్చు చేశారు. ఎడా పెడా చేస్తున్న అప్పులతో భవిష్యత్‌లో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి. ఈ అశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST