ETV Bharat prathidwani: రాజధాని పేరిట వైసీపీ సర్కారు దాగుడుమూతలాట..! - ఏపీ ప్రభుత్వ విధానాలపై
ETV Bharat prathidwani: రాజధానిపై అసలు రంగులు బయట పెట్టుకుంటోంది... అధికార వైసీపీ. ఇప్పటికే రాష్ట్ర రాజధాని ఏదీ అంటే... ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి ప్రజల్ని నెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కొద్దిరోజులుగా ఈ విషయంలో కోర్టుల్లోనూ అనేక కేసులు నడుస్తున్నాయి. ఆ సందర్భంగానే న్యాయస్థానాలకు ఇచ్చిన అఫిడవిట్లకు భిన్నమైన రీతిలో.. విశాఖ రుషికొండపై కట్టేది సెక్రటేరియట్ నిర్మాణాలే అంటూ సంచలన ట్వీట్ పెట్టింది... అధికార వైసీపీ. స్వల్ప వ్యవధిలోనే ఆ ట్వీట్ పొరపాటు అంటూ తొలగించింది. అసలు ఏమిటి ఈ డ్రామా? ప్రజలకు, రాజధాని సంబంధ కేసులు విచారిస్తున్న కోర్టులకు వైసీపీ ఏం చెప్పదలుచుకుంది? 1330 రోజులకి పైగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు దిక్కెవరు? ట్విటర్ ద్వారా చెప్పదలుచుకున్నది చెప్పి.. తర్వాత పొరపాటు జరిగిందని ఆ ట్వీట్ డెలీట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ వైకాపా నేతలు నుంచి సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్ నాటికి విశాఖ నుంచే పాలన అని పదేపదే చెబుతున్నారు. న్యాయస్థానం తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వ పెద్దలు అలాంటి ప్రకటనలు చేయటం వ్యవస్థలను అవమానించటం కాదా? ఇదే అంశంపై నేట ప్రతిధ్వని.