PRATHIDWANI తొలిసారి రాజ్‌భవన్ చేరిన ఉద్యోగుల జీతాల వ్యవహారం - ఏపీ తాజా ప్రతిధ్వని
PRATHIDWANI ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం అయిన వారి వేతనాలు, బకాయిల వ్యవహారం ఇప్పుడు రాజ్‌భవన్‌కు చేరింది. ఉద్యోగ సంఘాల చరిత్రలో మొదటిసారిగా తమ సమస్యలపై నేరుగా గవర్నర్‌నే కలసి మొర పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు. ఉద్యోగసంఘం నాయకుల్ని జోకర్లుగా చూస్తున్నారన్న ఒక సంఘం ఆవేదన వ్యక్తం చేసిన రోజు వ్యవధిలోనే ఇలా మరో సంఘం నేతలు గత్యంతరం లేకనే గవర్నర్ కలవాల్సి వచ్చిందని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అసలు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైకాపా పెద్దలు ఏం హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ 44 నెలల్లో ఏం చేశారు. తరచూ ఏదో రూపంలో ఇలా ఉద్యోగసంఘాల ఆవేదన, ఆందోళనలకు ఎందుకు. వాటికో పుల్‌స్టాప్ ఎక్కడ. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.