PRATHIDWANI: నిర్లక్ష్యం నీడన దేవాలయాలు.. తప్పడం లేదు భక్తులకు అగచాట్లు - t prathidhwani on Condition of Temples
మొన్న సింహాచలం చందనోత్సవంలో భక్తుల అగచాట్లు చూశాక... అసలు ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల పాలక మండళ్ల నియామకాలు వాటి పని తీరుపై కొంత కాలంగా భక్తుల్లో అసంతృప్తి వెలువడుతోంది. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ దేవాయాల పరిస్థితిపై కొంత మంది పోరాడుతున్నారు. ఒంటిమిట్టలో శ్రీరామనవమి కావొచ్చు... తిరుమల బ్రహ్మోత్సవాలు కావొచ్చు... ప్రభుత్వం తరఫున నిర్వహించాల్సిన లాంఛనాలు సక్రమంగా జరుగుతున్నాయా? అసలు ఈ ప్రభుత్వాధినేత ప్రతిపక్షంలో ఉండగా దేవాలయాలు, బ్రాహ్మణులకు సంబంధించి ఏమని హామీలు ఇచ్చారు? వాటిని ఎంత మేరకు నెరవేర్చారు? రామతీర్థం నుంచి మొదలు పెడితే శ్రీశైలం వరకు తరచు వివాదాల్లోకి రావడానికి కారణం ఏమిటి? ప్రధాన దేవాలయాల సంగతి పక్కన పెడితే ఇవాళ చిన్నచిన్న ఆలయాలు, అక్కడ అర్చకుల పరిస్థితుల ఏమిటి? వారికోసం కామన్ గుడ్ ఫండ్ వినియోగం ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాల వ్యవస్థలో తక్షణం చేపట్టాల్సిన సంస్కరణలు ఏమిటి? ప్రభుత్వం సరిదిద్దు కోవాల్సినవి ఏమిటి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ.