ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

Prathidhwani:సైబర్‌ నేరాల పట్ల.. ఏఏ విషయాల్లో అవగాహన పెంచుకోవాలి

By

Published : Jun 28, 2022, 10:40 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

Prathidhwani: సామాజిక మాధ్యమాల్లో పరిచయస్తులు, ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టిస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యులు, ఉద్యోగులతోపాటు ఇప్పుడు పోలీసులు, అధికారులను సైతం వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీస్ బాసులు, ఐఏఎస్‌ అధికారులనూ వదిలిపెట్టడం లేదు. విరాళాలు, ఖరీదైన బహుమతులు, రుణాలు, ఉన్నత ఉద్యోగాలు ఆశ చూపిస్తున్న సైబర్‌ మోసగాళ్లు... కనీస మొత్తాలు జమ చేయాలంటూ మనీ యాప్స్‌ లింకులు పంపిస్తున్నారు. తొందరపడి ఈ ఉచ్చుల్లో చిక్కుకుంటున్న వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు, సైబర్‌ దాడుల మూలాలు ఎక్కడున్నాయి? వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలకు ఎలాంటి సన్నద్ధత అవసరం? వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు ఏఏ విషయాల్లో అవగాహన పెంచుకోవాలనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details