ఆంధ్రప్రదేశ్

andhra pradesh

etv_bharat_prathidwani_debate_on_ysrcp_govt_on_bc_welfare

ETV Bharat / videos

రాష్ట్రంలోని బీసీలకు వైసీపీ ఏం చెప్పింది ? ఏం చేస్తోంది ? - ఈ టీవీ భారత్​ ప్రతిధ్వని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 15, 2023, 10:42 PM IST

Prathidwani: బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాదు, దేశానికే బ్యాక్‌ బోన్‌ వారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మాటల్లోని ప్రేమ ఆయన చేతల్లో మచ్చుకైనా కనిపిస్తోందా. ప్రచారంలోని ఆర్భాటానికి వాస్తవాలకు పొంతన ఉందా. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు బీసీలకు ఏం ఒరిగింది. ఏం మేలు జరిగింది. వెనకబడిన వర్గాలకు జగన్‌ అసలేం చెప్పారు. ఏం చేస్తున్నారు. పథకాలేంటి. వాటి ఫలితాలేంటి. బీసీలకు ప్రకటించిన డిక్లరేషన్‌ కంటే ఎక్కువే చేశాం అని సీఎం జగన్ చాలాసార్లు చెప్పారు. జయహో బీసీ సభలు కూడా నిర్వహించారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం వచ్చాకా అదనంగా ఏం చేసింది. పలు నియామకాలు, పదవుల పంపిణీలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు.  బీసీలకు సంబంధించి వివిధ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. వాటి పనితీరు ఎలా ఉంది. బీసీలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏవేం కొత్త పథకాలు చేపట్టింది. వాటి అమలు ఎలా ఉంది. పాదయాత్రలో 139 బీసీ కులాల కష్టాలను తెలుసుకుని సీఎం అయ్యాకా వారికి పెద్దపీఠ వేశానని జగన్ చెబుతున్నారు. నిజంగా 139 కులాలకు తగిన న్యాయం చేశారా. ఇదీ నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details