సాగునీటి కష్టాలను ఎదుర్కోంటోన్న రాయలసీమ- కరువు ప్రభావం ఎలా ఉంది
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 10:22 PM IST
Prathidwani: తీవ్ర కరవు పరిస్థితుల్లో రాయలసీమ విలవిల్లాడుతోంది. కరవుమంటల్లో చిక్కుకున్న రైతుల్ని ఆదుకోవడంలో, జగన్ ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉందా. ఎప్పుడూ లేని రీతిలో సీమ రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అసలు కారణాలు ఏమిటి. గత ప్రభుత్వంలో ముందుచూపుతో చెరువులు నింపి, పరిశ్రమలకు కూడా నీళ్లు ఇచ్చిన పరిస్థితుల నుంచి, నెర్రెలుబారిన చేలల్లో కన్నీళ్లింకిన దుస్థితికి బాధ్యత ఎవరిది. జగన్ సర్కారు ఇవన్ని పట్టించుకోకుండా కరవు అంశాన్ని గాలికి వదిలేసిందనే విమర్శలను ఎగదుర్కోంటోంది. నీటి వాటాల పరిరక్షణలోనూ విఫలమయ్యారని విమర్శలను సైతం ఎదుర్కోంటోంది. రాయలసీమ జిల్లాల్లో కరవు ప్రభావం ఎలా ఉంది. సాగునీటి కోసం రైతులు ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో రాయలసీమలో చెరువులు నింపారు. కియా వంటి పరిశ్రమల అవసరాలకు నీరిచ్చారు. ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోంది. అసలు నీటికోసం ఏంటీ పాట్లు. ఓవరాల్‌గా రాయలసీమ జిల్లాల మీద కరవు ప్రభావం ఎలా ఉంది ఇదే అంశంపై నేటీ ప్రతిధ్వని