రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్రిసిల్ నివేదిక పెను సంచలనం - ratings by crisil
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 9:41 PM IST
Prathidwani:పరిధి దాటిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారిందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించిన నివేదిక పెను సంచలనంగా మారింది. అందినకాడికి అప్పులు చేసిన జగన్ ప్రభుత్వతీరును నడిబజారులో చర్చకు పెట్టింది. నాలుగున్నరేళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని ఎవరైనా మాట్లాడితే చాలు కస్సుమంటుంది జగన్ ప్రభుత్వం. మరిప్పుడు అదే ప్రభుత్వ క్రిసిల్ రేటింగ్‌పై ఏం సమాధానం చెబుతుంది. చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌తోనే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారని, కనీసం వడ్డీ చెల్లింపులకు సరిపడా నిధులు కూడా సదరు ఖాతాల్లో లేవంటూ అమరావతి బాండ్ల రేటింగ్ తెగ్గోసింది క్రిసిల్ సంస్థ. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈ ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ ఇచ్చిన రేటింగ్స్ ఇంత సంచలనం ఎందుకు అయ్యాయి. రాష్ట్రం గురించి ఆ సంస్థ తన నివేదికలో ఏం చెప్పింది. క్రిసిల్ రేటింగ్ అంటే ఏమిటి. వాళ్లు ఏ ఏ అంశాలు పరిశీలిస్తారు. క్రిసిల్ ఇచ్చిన నివేదిక ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలా పనిచేస్తుంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.