Prathidwani: నేతన్న కష్టాలు తీరేదెన్నడు.. పూర్వ వైభవం వచ్చేదెన్నడు? - చేనేత కార్మికుల ఇబ్బందులు
Prathidwani: ఆంధ్రప్రదేశ్లో చేనేతలు దీనావస్థలు ఏ మాత్రం మారడం లేదు. ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం ఇచ్చి.. నేతన్నలని ఆదుకుంటున్నామని ప్రభుత్వం చెప్తున్నా వారి స్థితిగుతుల్లో ఎలాంటి మార్పు రాని దుస్థితి. నూలు సబ్సిడీ రాక.. మరమగ్గాలతో పోటీపడలేక.. అరుదైన ఈ పనితనం చిన్నబోతోంది. ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే ఉండటం లేదు. సరైన మార్కెటింగ్ లేకపోవడం.. ఆప్కో నుంచి కొనుగోళ్లు చేపట్టకపోవడం నేతన్నను తీవ్రంగా నష్టపరుస్తోంది. రోజు మొత్తం కుటుంబమంతా కష్టించి పనిచేసినా కనీస కూలీ రాకపోవడం వారిని ఇబ్బందులపాలు చేస్తోంది. గుర్తొచ్చినప్పుడు మాత్రమే ఘనంగా ప్రకటనలు చేస్తోన్న వైసీపీ ప్రభుత్వం.. వారిని ఆదుకోవడంలో మొండిచేయి చూపుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ చేనేత వర్గాలకు ఏమేమీ హామీలు ఇచ్చారు? నాలుగేళ్ల పాలనలో ఎన్ని అమలు చేశారు? ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు.. నేతన్నల ఆదాయాలు మూడు రెట్లు పెరిగాయా? చేనేతకార్మికుల గోడు వింటున్నారా? అసలు చేనేత కష్టాలు తీరేదెప్పుడు.. వారికి పూర్వ వైభవం వచ్చేదెప్పుడు? ఇదీ నేటి ప్రతిధ్వని