ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? - ప్రతిధ్వని
Benefits of Filing Income Tax Return: ఆదాయపన్ను వివరాల సమర్పణకు మార్చి 31 వరకు గడువు ముగుస్తోంది. అసలు ఆదాయ పన్నులో రెండు రకాల పద్ధతులు అనేవి ఎందుకు వచ్చాయి? అదే విధంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు.. పాత, కొత్త పద్ధతుల్లో దేనిని ఎంచుకోవాలి.. రెండింట్లోనూ ఉన్న అనుకూల ప్రతికూలతలేంటి అనే సంశయం చాలా మందిలో ఉంది. ఓ వృత్తి వారికి ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుంది? ప్రస్తుతం ఎన్ని స్లాబులు ఉన్నాయి? వేటివేటికి పన్ను మినహాయింపులు వర్తిస్తాయి అనే సమాచారం చాలా మందికి తెలియదు. పన్ను భారం తగ్గించుకునే మార్గాల కోసం అన్వేషించే వారిలో.. ఎందరికో కొన్ని పన్ను మినహాయింపుల గురించి అవగాహన ఉండట్లేదు. ఏదైనా కారణాల గత 3 ఏళ్లుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేని వాళ్లు ఇప్పుడు ఏం చేయాలి అనే సందేహం కూడా కొంత మందికి ఉంటుంది. వీటికి సంబంధించిన సూచనలు, సలహాలపై నేటి ప్రతిధ్వనిలో చర్చ.