PRATHIDWANI తీవ్రంగా కలవర పెడుతున్న గుండెజబ్బులు - about prathidwani
గుండె జబ్బుల్ని గుర్తించడం ఎలా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. కొంత కాలంగా పెరుగుతున్న గుండెజబ్బులు, కార్డియాక్ అరెస్టులే అందుకు కారణం? అప్పటి వరకు నవ్వుతూ, ఉత్సాహంగా మన మధ్య ఉన్నవారే ఉన్నట్లుండి కుప్పకూలి పోతున్నారు. ఏవో అలవాట్లు ఉన్నవారంటే సరే.... కానీ ఏ అలవాట్లు లేని వాళ్ల కూడా గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? అసలు ఈ ఆపదలపై గుండె ఏవైనా సంకేతాలు పంపుతుందా? వాటిని గుర్తించి జాగ్రత్త పడడానికి ఏం చేయాలి? 40 ఏళ్ల వయసుకే గుండె జబ్బులు రావటం ఏమిటి? అసలు ఫిట్‌గా కనిపించేవారిలోనూ గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయనే అంశాలపై నేటి ప్రతిధ్వని.