తాత్కాలిక ముసుగులో రాజధాని తరలింపు - దొడ్డిదారి జీవో కోర్టు ధిక్కారం కాదా ! - CM Camp Office in Visakha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 9:49 PM IST
Prathidwani: రాజధాని విషయంలో మరో డ్రామాకు తెర లేపింది జగన్ ప్రభుత్వం. అమరావతిని దాటి తాత్కాలిక వసతి ముసుగులో.. రాజధానిని విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారికంగా విశాఖకు మార్చేందుకు హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారడంతో.. సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు, వివిధ శాఖల కార్యాలయాల్ని అడ్డదారిన ఏర్పాటు చేయబోతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష కోసం ఈ కార్యాలయలన్నీ.. అంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు భవనాల కేటాయింపులు కూడా చేసేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని హైకోర్టు విస్పష్ట తీర్పు ఉన్న పరిస్థితుల్లో కూడా జగన్ ప్రభుత్వం ఈ చర్యల్ని ఎలా చూడాలి. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి. సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు సహా ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ తరలించేందుకు వీల్లేదని 2022 మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ఆ ఆదేశాలు అమల్లోకి ఉండగానే దొడ్డిదారిన జీవో ఇవ్వడం కోర్టుధిక్కారం కాదా. అమరావతి రైతుల ముందు ఇప్పుడు ఉన్న మార్గమేంటి. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.