ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డైట్‌ ప్రతిధ్వని

ETV Bharat / videos

నాజుకుగా ఉండటం కోసం డైట్‌ చేస్తున్నారా..! - why dieting becomes harmful

By

Published : Mar 11, 2023, 9:42 PM IST

Updated : Mar 12, 2023, 6:14 AM IST

ఇటీవల ప్రతిచోటా వినిపిస్తున్న పదం.. డైట్‌! నాజుకుగా ఉండాలనో, నలుగురిలో తళుక్కున మెరవాలనో, లేదంటే అధికబరువు, దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవాలని, ఎవరికి వారు డైట్ బాట పడుతున్నారు. కానీ చాలామందికి వీటిపై సరైన అవగాహన లేక యూట్యూబ్‌, సోషల్ మీడియాల్లో వచ్చే నానారకాల కంటెంట్‌లు ఫాలో అయ్యి కిందామీదా పడుతున్నారు. ఫలానా సెలెబ్రిటీ ఎక్కడో చెప్పారనో... లేదా ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్ చేస్తున్నారనో గుడ్డిగా వారిని ఫాలో అయిపోతున్నాం. అసలు డైట్‌లో ఎన్నిరకాలుంటాయో తెలుసా? ఏ డైట్ ఎవరికి మంచిది? వాటివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఆ నియమాలు ఎంతకాలం పాటించాలి? డైట్‌ ప్లాన్‌ విషయంలో తప్పక గమనించాల్సిన సంగతులేమిటి? చాలామంది విదేశీ ప్రముఖులు, సినీతారలు, క్రీడాకారుల డైట్‌ ప్లాన్‌ గురించి వెదికి అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు. డైట్‌ ప్లాన్స్ విషయంలో వైద్యులు... ప్రకృతి, సేంద్రీయ ఆహారాల పేరుతో ప్రాచుర్యం పొందిన వారి మాటలమధ్య వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. ఎవర్ని నమ్మాలి అసలు డైట్ చేసే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Mar 12, 2023, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details