Prathidhwani: రాజకీయ క్రీడలో బలవుతున్న... విశ్వవిద్యాలయాలు - రాజకీయ క్రీడలో విశ్వవిద్యాలయాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 10:12 PM IST
Prathidhwani: సమాజానికి దిక్సూచీగా ఉంటూ... విజ్ఞాన నిలయాలుగా భాసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థితిలో ఉన్నాయి? ఏపీలో ఉన్నత విద్య స్థితిగతులపై జాతీయ రాంకింగ్స్ ఏం చెబుతున్నాయి? దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రం నుంచి ఏవైనా ఉన్నాయా? మనం ఎక్కడ ఉన్నాం... ఒక విశ్వవిద్యాలయం ఉత్తమ ఫలితాలు సాధించాలంటే అందులో బోధన, బోధనేతర సిబ్బంది పాత్ర ఏంటి? రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? వాటిని నింపాలనే స్పృహ ఈ ప్రభుత్వానికి ఉందా? విద్యార్థుల భవిష్యత్తు విశ్వవిద్యాలయం ప్రమాణాల మీద ఆధారపడి ఉంటే విశ్వవిద్యాలయం భవిష్యత్తు వైస్ ఛాన్సలర్ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నత విద్యలో ప్రపంచవ్యాప్తంగా అనేక నూతన మార్పులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా విద్యా ప్రమాణాల్లో గొప్ప గొప్ప మార్పులు వస్తున్నాయి. వాటికి తగినట్టు మన యూనివర్సిటీలు సన్నద్ధం అవుతున్నాయా? ఏపీ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయిలో కాకపోయినా కనీసం జాతీయ స్థాయిలో అయినా గుర్తింపు పొందాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేయకూడని పనులు ఏంటి? చేయాల్సిన పనులు ఏంటి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని.