PRATHIDHWANI: ఇక జగనన్నకు చెబుదాం... - jaganannaku chebudam
ప్రజా సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా మిగిలిపోరాదు.. వేటికి ఎలాంటి పరిష్కారాలు చూపాలనే దానిపై ఓ విధానం తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేయాలి. ఇదే స్ఫూర్తితో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే.. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నాఉలిక్కి పడుతున్న.. కేసులు పెడుతున్న.. ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రజల కష్టనష్టాలు ఏమిటో తెలియవా? సంపూర్ణ మద్యనిషేధం నుంచి జాబ్ క్యాలెండర్ వరకు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏమని ఏం సమాధానం చెబుతారు? దానికి కాస్త ముందుగా... ఈ నెల 7 నుంచే ప్రారంభించనున్నాం అన్న జగనన్నే మా భవిష్యత్.. ప్రోగ్రామ్‌పై రాజకీయంగా ఎలాంటి స్పందన వస్తోంది? ప్రజాస్వామ్యంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షాలు అనేవి ఉంటాయి. పత్రికలు అనేవి వాటి పాత్రను నిర్వహిస్తాయి. కానీ వాటిలో వచ్చే సూచనలను ఏమాత్రం సహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు జనం చెప్పేదాన్ని ఆలకిస్తారా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.