PRATHIDWANI: ఇచ్చిన హామీలు నెరవేర్చరా.. అంగన్వాడీల ఆందోళన - ప్రతిధ్వని కార్యక్రమం
హామీల అమలు కోసం మరోసారి రాష్ట్రంలో ఆందోళనబాట పట్టారు అంగన్‌వాడీ వర్కర్లు. పాదయాత్రలో, ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు.. నేటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్నామని కదం తొక్కారు. ఇచ్చినమాట మేరకు ఉద్యోగభద్రత.. కనీస వేతనం పెంపు, గ్రాట్యుటీ, పదవీవిరమణ ప్రయోజనాలూ అందించాలని అభ్యర్థించారు. ఎప్పటినుంచో చేస్తున్న ఈ విన్నపాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అసలు పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది? అంగన్‌వాడీలకు ఏం చెప్పారు? ఏం చేశారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.