ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రతిధ్వని

ETV Bharat / videos

PRATHIDHWANI పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఏర్పాటు ఉద్ధేశం ఏమిటి? - about Graduate MLC Election

By

Published : Mar 10, 2023, 9:53 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు విస్తుగొలుపుతున్నాయి. పట్టభద్రులు కాని వారికీ నకిలీధ్రువపత్రాలతో ఓట్లు నమోదు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోగస్‌, నకిలీ ఓట్లకు సంబంధించి విపక్షాలు బయట పెడుతున్న వివరాలు కూడా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటున్నాయి. వేల సంఖ్యలో బోగస్‌ ఓట్లు నమోదు చేయించారంటున్న ప్రతిపక్ష నేతలు వాటి ఈసీ సకాలంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళతామని అంటున్నారు. మరి... స్వేచ్ఛ, పారదర్శక వాతవరణంలో జరగాల్సిన ఎన్నికల విషయంలో దొంగఓట్ల ఆరోపణలపై ఎన్నికల కమిషన్, అధికారులు ఏం చేస్తున్నట్లు.. ఈ పరిస్థితులకు ఎవరిది బాధ్యత. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల్లో బోగస్‌, నకిలీ ఓట్లపై కొద్దిరోజులుగా ఎందుకని తీవ్రస్థాయిలో దుమారం రేగడానికి కారణాలు..  ఒకరికి 11మంది తండ్రులు, మరో మహిళకు 18మంది భర్తలు. ఎమ్మెల్సీ ఎన్నికల జాబితా వివరాలపై వచ్చిన ఆరోపణలివి. అలాంటి దరఖాస్తులు ఆమోదించేటప్పుడు కనీసంపరిశీలించడం లేదా అనే  అంశాలపై.. నేటి ప్రతిధ్వని కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details